బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న చిన్న సినిమా!
on Jul 20, 2025

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'సైయారా'. ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెడుతోంది. (Saiyaara)
మర్డర్ 2, ఆషికీ 2, ఏక్ విలన్, మలంగ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైయారా'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన 'సైయారా' మూవీ.. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.64 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో మరో రూ.40 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. ఫుల్ రన్ లో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్-2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ భారీ సినిమాకి ముందు 'సైయారా' రూపంలో వారికి బిగ్ హిట్ వచ్చిందని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



